Monday, 6 July 2015

Ee Peddollunnare Movie Working Stills



                               



                                                                                                                      రెగ్యులర్‌ షూటింగ్‌లో ‘‘ఈ పెద్దోళ్లున్నారే...’’
     ‘అబ్బాయి క్లాస్‌`అమ్మాయి మాస్‌’ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమై.. ప్రామిసింగ్‌ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకొన్న యువ ప్రతిభాశాలి కోనేటి శ్రీను తాజాగా రూపొందిస్తున్న చిత్రం ‘‘ఈ పెద్దోళ్లున్నారే..’’. కోనేటి ఫిలింస్‌ పతాకంపై శ్రీమతి కె.హనిత నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా ‘అరవింద్‌`అపూర్వ అరోరా’ హీరోహీరోయిన్లుగా పరిచయమవుతున్నారు. రావురమేష్‌, కాశీవిశ్వనాధ్‌, పూర్ణిమ(మాజీ హీరోయిన్‌), మాధవి ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం ఇటీవల రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభించుకొంది. హైద్రాబాద్‌ మరియు పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న ఫస్ట్‌ షడ్యూల్‌లో హీరోహీరోయిన్లు అరవింద్‌`అపూర్వ అరోరాలతోపాటు.. రావు రమేష్‌, కాశీవిశ్వనాధ్‌, పూర్ణిమ తదితరులపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. 
    ఈ సందర్బంగా చిత్ర దర్శకుడు కోనేటి శ్రీను మాట్లాడుతూ.. ‘‘పెద్దవాళ్లకు`పిల్లలకు మధ్య గ్యాప్‌ అనేది ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. ‘ఈ కాలం పిల్లల్ని పట్టుకోలేకపోతున్నాం’ అనే మాట తరతరాల నుంచి.. ఇప్పటివరకూ వింటూనే ఉన్నాం. పెద్దలకు`పిల్లలకు మధ్య ఉండే తరాల అంతరాన్ని, అభిప్రాయబేధాల్ని వినోదాత్మకంగా, ఆలోచనాత్మకంగా చర్చిస్తూ రూపొందిస్తున్న సినిమా ‘‘ఈ పెద్దోళ్లున్నారే..’’. కొత్త`పాతల మేలు కలయికగా.. నూతన తారలు`సీనియర్‌ ఆర్టిస్టుల కాంబినేషన్‌లో.. నేటి యువతరం అభిరుచులకు అద్దం పడుతూ.. పెద్దవాళ్ల మనోభావాలను ప్రతిబింబిస్తూ.. అందరికీ నచ్చే విధంగా ‘‘ఈ పెద్దోళ్లున్నారే..’’ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నాం’ అన్నారు.
      భాను, పాషా, మనోహర్‌, గౌతమ్‌, సుధీర్‌, జయంత్‌, గెలాక్సీ రమేష్‌, శ్రీవంశిక, శైలజ, అశ్విని ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానిక మాటలు: నివాస్‌, సంగీతం: వెంగీ, సినిమాటోగ్రఫి: సాయిశ్రీరామ్‌, ఎడిటర్‌: కోటగిరి వెంకటేశ్వర్రావు, ఆర్ట్‌: రామాంజనేయులు, మేకప్‌మేన్‌: నంద్యాల గంగాధర్‌, స్టిల్స్‌: వాసు, మేనేజర్‌: రవి, ప్రెస్‌ రిలేషన్స్‌: ధీరజ అప్పాజీ, పబ్లిసిటీ డిజైనర్‌: కృష్ణప్రసాద్‌, కాస్ట్యూమ్స్‌: రాజు, కో`డైరెక్టర్‌: శ్రీవాత్సవ్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: విజయ్‌ పంజాల, నిర్మాత: శ్రీమతి కె.హనిత, కథ`స్క్రీన్‌ప్లే`దర్శకత్వం: కోనేటి శ్రీను!!

No comments:

Post a Comment