Tuesday, 28 July 2015

Lakshmi Devi Samarpinchu Nede Chudandi Movie Logo Launch










కలర్స్ అండ్ క్లాప్స్ ఎంట్ టైన్మెంట్స్ సమర్పణలో మేరువ సుబ్బారెడ్డి నిర్మాతగాసహ నిర్మాతగా సిరాజ్జాకీ అతిక్ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ నిర్మిస్తోన్న సోషియో ఫాంటసీ చిత్రం లక్ష్మీదేవి సమర్పించు నేడే చూడండి. ఈ చిత్ర టైటిల్ లోగో ఆవిష్కరణ ప్రసాద్ ల్యాబ్ లో జరిగింది. నరేష్ టైటిల్ లోగోను ఆవిష్కరించారు.హీరో హీరోయిన్లకు ఆదరణ పెరిగి వారినే దైవంగా భావిస్తే అభిమానులు వారికి పూజలు చేయడం వంటి చర్యలను గమనించిన దేవుళ్లు మనమే చిత్ర నిర్మాణం ఎందుకు చేయకూడదని భావించి లక్ష్మీదేవి నిర్మాతగానారదుడు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తూ చిత్ర పరిశ్రమలో నటనఫోటోగ్రఫీదర్శకత్వంపై ఆసక్తి ఉన్న ముగ్గురు యువకులను పరిచయం చేస్తూ లక్ష్మీదేవి సమర్పించు నేడే చూడండి అనే సినిమా తీస్తారు. చిత్ర నిర్మాణంలో దేవుళ్లకు కూడా  ఇబ్బందులు తప్పవని తెలసుకుంటారు. ఈ కాన్సెప్ట్ తో ఈ చిత్రం రూపొందింది. నరేష్ఆమని లక్ష్మీదేవివిష్ణుమూర్తిలుగా నటిస్తే ప్రముఖ నటుడు గౌతంరాజు తనయుడు కృష్ణ-జననిఅఖిల్-భార్గవిచరణ్-ప్రగ్నా జంటలుగా నటించారు. ప్రస్తుతం సినిమా రీరికార్డింగ్ పనులను జరుపుకుంటుంది. ఈ చిత్రంలోని పాటలను ఆగస్టు మూడో వారంలో విడుదల చేయాలనుకుంటున్నట్టు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.
ఈ చిత్రానికి సంబంధించి రఘురామ్ కంపోజన్ లో గీతామాధురిమాళవిక పాడిన ప్రమోషనల్ సాంగ్ ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మారుతిరామకృష్ణగౌడ్గీతాసింగ్, గౌతంరాజు సహా దర్శక నిర్మాతలుచిత్రయూనిట్ సభ్యులు పాల్గొని చిత్రయూనిట్ ను అభినందించారు. ఈ చిత్రానికి సంగీతం: శ్రీకోటికెమెరా: రఘు ఆర్.బళ్లారిలైన్ ప్రొడ్యూసర్: నాగేంద్ర గాదెం శెట్టిసహ నిర్మాత: సిరాజ్కథ,మాటలుస్క్రీన్ ప్లేదర్శకత్వం: జాకీ అతిక్.

No comments:

Post a Comment