Monday, 13 July 2015

ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణంలో వారాహిచలనచిత్రం – నారా బ్రాహ్మిణికి చెక్ ను అందజేసిన సంస్థ అధినేత సాయికొర్రపాటి

తెలుగు చిత్రసీమలో ఈగఅందాల రాక్షసిలెజెండ్ఉహలు గుస గుసలాడేదిక్కులు చూడకు రామయ్యాతుంగభద్ర వంటి విజయవంతమైన చిత్రాలను వారాహి చలనచిత్రం బ్యానర్ పై నిర్మించిన ఆ సంస్థ అధినేత సాయికొర్రపాటి  ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంలో భాగస్వామ్యులయ్యారు. ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని నిర్మాణంలో వారాహి చలనచిత్రం భాగం కావాలనుకున్న ఆయన కృష్ణాజిల్లాలో బాహుబలి బెనిఫిట్ షోను ఏర్పాటు చేసి తద్వారా వచ్చిన మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకి అందజేయాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా నిర్వహించిన ఈ బెనిఫిట్ షోస్ ద్వారా 24,56,789 రూపాయల ఆదాయం వచ్చింది. ఈ మొత్తాన్ని నూతన నిర్మాణ రాజధానికి విరాళంగా వారాహి చలనచిత్రం అధినేత సాయికొర్రపాటి ఈరోజు(జూలై 11న) ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కోడలు నారా బ్రాహ్మణికి అందజేశారు. ఎన్నో ఉత్తమ చిత్రమ చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన నిర్మాత సాయికొర్రపాటి సినిమా రంగంతో పాటుసేవారంగంలోనూ ముందుంటున్నారు. గతంలో హుదూద్ బాధితులకు ఆర్ధిక సహాయంతో పాటు వంద టన్నుల బియ్యం కూడా అందించారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణంలో పాలుపంచుకుని సహృదయతను చాటుకున్నారు. 

No comments:

Post a Comment