డబ్బింగ్ జరుపుకుంటున్న లవ్ మ్యాజిక్
బీచుపల్లి ఆంజనేయ ప్రొడక్షన్స్ పతాకంపై ఇంతకుముందు ''మా వూరి దేవుడయ్య '' చిత్రాన్ని నిర్మించిన బీచుపల్లి రఘు తాజాగా 3జి లవ్ ఫేం సందీప్ హీరోగా దివా నా సిద్దు దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ''లవ్ మ్యాజిక్ ''. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో రెండు షెడ్యూళ్ళ లో చిత్ర నిర్మాణం పూర్తిచేసుకుంది . సందీప్ -వికాసిని ,శ్రీను -రోజా ,హర్ష - స్వాతి జంటలుగా నటిస్తున్న ఈ లవ్ మ్యాజిక్ ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలను జరుపుకుంటోంది . త్వరలోనే ఆడియో రిలీజ్ చేసి ఆగస్టు లేదా సెప్టెంబర్ లో సినిమాని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు దర్శక నిర్మాతలు . ఈ సందర్భంగా చిత్ర నిర్మాత బీచుపల్లి రఘు మాట్లాడుతూ ''ఇంతకుముందు మా వూరి దేవుడయ్య '' వంటి సందేశాత్మక చిత్రాన్ని నిర్మించాను తాజాగా లవ్ మ్యాజిక్ అనే చిత్రాన్ని చేస్తున్నాను . ప్రస్తుతం ఉన్న యంగ్ జనరేషన్ ప్రేమ అనే పేరుతో ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తున్నారు ,అయితే స్వచ్చమైన ప్రేమ ఎప్పటికీ మారిపోదు ఓడిపోదు అన్న కాన్సెప్ట్ తో ఈ చిత్రాన్ని నిర్మించాం తప్పకుండా ప్రేక్షకులకు అందరికీ నచ్చుతుందని నమ్మకంగా ఉన్నామని,భరత్ అందించిన పాటలు చాలాబాగా వచ్చాయని త్వరలోనే ఆడియో వేడుక నిర్వహించి ఆగష్టు లేదా సెప్టెంబర్ లో సినిమాని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని అన్నారు .
డీకే భరత్ సింహారెడ్డి -డీకే అరుణ ల ఆశీస్సులతో
కెమెరా : శ్రీ వాసు
లిరిక్స్ : సుభాష్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ :భీమవరం గిరిబాబు
సంగీతం : భరత్
నిర్మాత : బీచుపల్లి రఘు
దర్శకత్వం : దివానా సిద్దు





No comments:
Post a Comment