Tuesday, 21 July 2015

జూలై 31న గ్రాండ్ లెవల్ విడుదలవుతున్న జర్నీ హీరో జై, ఆండ్రియా 'ఛాలెంజ్' Movie Stills




జూలై 31న గ్రాండ్ లెవల్ విడుదలవుతున్న జర్నీ హీరో జై, ఆండ్రియా  'ఛాలెంజ్'
ఈ సమ్మర్ లో వలియవన్ పేరుతో తమిళంలో విడుదలైన భారీ విజయాన్ని సొంతం చేసుకునిమంచి కలెక్షన్స్ సాధించిన  చిత్రాన్ని తెలుగులో ఛాలెంజ్ పేరుతో విడుదల చేస్తున్నారు. జర్నీ సినిమా సక్సెస్ తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరో జై హీరోగా నటిస్తున్నారు. తమిళంలో ఘనవిజయాన్ని సాధించిన ఈ చిత్రం తెలుగు రీమేక్ హక్కుల కోసం చాలా మంది నిర్మాతలు పోటీపడినప్పటికీ గోపిచంద్ పండగ ఈ చిత్ర రీమేక్ హక్కులను పొందారు. జై మారుతి పిక్చర్స్ బ్యానర్ పై ఈ చిత్రం జూలై 31న గ్రాండ్ లెవల్ లో విడుదలవుతుంది. ఈ చిత్రంలో ఆండ్రియా హీరోయిన్ గా నటించింది. జర్నీసినిమాని డైరెక్ట్ చేసిన ఎమ్.శరవణన్ ఈ ఈచిత్రాన్ని డైరెక్ట్ చేశారు. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రంలో ఓ యువకుడు తన ఫ్యామిలీ కోసంలక్ష్యం కోసం ఏం చేసాడనేదే కథ. ఈ సినిమా కోసం హీరో జై సిక్స్ ప్యాక్ పెంచాడు. జర్నీ తర్వాత శరవణన్జై కాంబినేషన్ లో వచ్చిన ఈ సక్సెస్ ఫుల్ మూవీ యూత్ సహా అన్నీ వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చిత్ర నిర్మాతలు తెలియజేశారు.  

No comments:

Post a Comment